మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: ప్రజా రోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైద్యులను, హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇటీవల కాలంలో ఎలాంటి అనారోగ్యం లేకున్ననప్పటికీ ఆకస్మత్తుగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం బాద్యతగా తాము పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలని శారీరక వ్యాయమం చేయాలని పేర్కొన్నారు.
ఇలాంటి మెడికల్ క్యాంప్ ద్వారా వ్యాధులు ఉన్నట్లు తేలితే వాటిని నివారించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నేటి యాంత్రీక యుగంలో ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. అనంతరం మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
