Saturday, March 7, 2026
Homeక్రైమ్మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగు బాటు

మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగు బాటు

  • 124 మంది జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్‌ క‌గార్ ప్ర‌వేశ‌పెట్టినప్ప‌టి నుంచి మావోయిస్టుల పై తీవ్ర ప్ర‌భావం చూపింది. మావోయిస్టుల ఏరివేత‌లో భాగంగా భారీ ఎత్తున కూంభింగ్ నిర్వ‌హించాయి. దీంతో ఎంతో మంది మాయిస్టులు అమ‌రుల‌య్యారు. క్ర‌మంగా వారి అగ్ర‌నాయ‌క‌త్వం కొంద‌రు కాల్పుల్లో చ‌నిపోగా మిగితా కొంత మంది లొంగిపోయారు.

దీంతో మావోస్టుల లొంగుబాటు ప్ర‌క్ర‌య‌లో భాగంగా శ‌నివారం మావోయిస్టు అగ్ర‌నేత‌ల‌తో స‌హా 124 మంది మావోస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. 124 మంది ఒకే సారి లొంగిపోవ‌డం పోలీసు చ‌రిత్ర‌లోనే రికార్డు అని అధికారులు తెలిపారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ క‌మిటి మొత్తం వారి ఆయుధాల‌తో స‌హా పోలీసుల వ‌ద్ద లొంగిపోయారు.

మాయిస్టులు లొంగిపోతే ప్ర‌భుత్వ అందిస్తున్న‌ పున‌రావాస ప‌థ‌కాలు, అభివృద్ది ప‌థ‌కాలు వారిని జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి క‌లిసేలా చేశాయ‌ని తెలుస్తుంది. లొంగుబాటు ముగిసిన అనంత‌రం సాయంత్రం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విలేక‌రుల స‌స‌మావేశం నిర్వ‌హించి లొంగిపోయిన మావోస్టుల వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. కాగా ప్ర‌భుత్వం క‌ల్పించే పున‌రావాస ప్యాకేజీల‌ను వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments