Homeక్రైమ్ముద్విన్ గ్రామంలో కుళ్లిన మటన్ సరఫరా కలకలం..

ముద్విన్ గ్రామంలో కుళ్లిన మటన్ సరఫరా కలకలం..

•చనిపోయిన గొర్రెలు, మేకల మాంసం నిల్వ చేసి అమ్మకాలు – గ్రామ ప్రజల్లో ఆందోళన..

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, ముద్విన్ గ్రామంలో కుళ్లిన మటన్ అమ్మకాల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మటన్ షాప్ యజమాని కొంతకాలంగా చనిపోయిన మేకలు, గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ మాంసాన్ని ఫ్రీజ్‌లో నిల్వ చేసి ప్రతిరోజు అమ్మే తాజా మటన్‌లో కలిపి విక్రయిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.హోళి పండుగ సందర్భంగా కొందరు గ్రామస్తులు మటన్ కొనుగోలు చేసి ఇంట్లో వండి తిన్న తర్వాత కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.గ్రామ ప్రజలు వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించి ముద్విన్ గ్రామంలో జరుగుతున్న ఈ మటన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు