హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మొదటి సెట్ నామినేషన్లు అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డి దాఖలు చేసారు. అంతకుముందు రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింగ్వి, వేం నరేందర్ రెడ్డి లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. గాంధీభవన్ చేరుకున్న నాయకులను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.
