Homeక్రైమ్గంజాయి క‌ల‌క‌లం... !

గంజాయి క‌ల‌క‌లం… !

  • గంజాయి విక్ర‌యిస్తూ నలుగురు విద్యార్దుల అరెస్టు

  • పోలీసుల ద‌ర్యాప్తు

సంగారెడ్డి, క్రైమ్ మిర్ర‌ర్: క‌ళాశాల‌లో చ‌దువుతూ గంజాయి విక్ర‌యిస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ‌డంతో ప‌టాన్ చెరువు ప్రాంతంలోక‌ల‌క‌లం రేపింది. విద్యార్థుల‌కు గంజాయి ఎవ‌రు స‌ర‌ఫ‌రా చేస్తున్నారా….విద్యార్థులెవ‌రైన దీనికి అల‌వాటు ప‌డ్డారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే ప‌టాన్ చెరువు ఆబ్కారీ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్లేసుల్లో గంజాయి విక్రయిస్తుండగా న‌లుగురు విద్యార్థులను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఒక కేసులో 297 గ్రాముల గంజాయిని సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మరొక కేసులో 5.4 గ్రాముల హైబ్రిడ్ గంజాయి ని ఎస్టిఎఫ్ బృందం పట్టుకుంది.

హైదరాబాద్ లో వేర్వేరు కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయి చరణ్, అభిషేక్, స్థానికంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న సాకేత్ రెడ్డి, ఆదిత్య కుమార్ లు కాగా వీరిపై కేసులు న‌మోదు చేసి పటాన్ చెరు ఆబ్కారీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తాజావార్తలు