Homeక్రైమ్చెరువులో చిన్నారి మృతదేహం.. గ్రామంలో విషాద ఛాయలు

చెరువులో చిన్నారి మృతదేహం.. గ్రామంలో విషాద ఛాయలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మెదక్ జిల్లా, కుల్చారం మండలం, పొతిరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు ఏళ్ల బాలుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం (ఫిబ్రవరి 28, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా మెదక్ జిల్లా, కుల్చారం మండలం, పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సారా వెంకటేష్ కుమారుడు సారా బిట్టు (4), శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

శనివారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కళ్లముందే తిరుగాడిన బిడ్డ ఇక లేడన్న నిజాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతుంటారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు