Homeజాతీయంఢిల్లీలో మిస్సింగ్ కేసుల క‌ల‌వ‌రం

ఢిల్లీలో మిస్సింగ్ కేసుల క‌ల‌వ‌రం

  • 15 రోజుల్లోనే 800 మందికిపైగా మిస్సింగ్
  • ఎక్కువ శాతం వ‌యోజ‌నులే
  • పురోగ‌తి లేని కేసులు

న్యూఢిల్లీ,క్రైం మిర్ర‌ర్ః   ఢిల్లీలో మిస్సింగ్ కేసులు ఆందోళన‌క‌రంగా మారాయి. జ‌న‌వ‌రి మొద‌టి 15 రోజుల్లోనే 500మందికిపైగా మహిళలు, బాలికలు సహా 800 మది ఆచూకీ లేకుండ పోవ‌డం క‌ల‌వ‌రానికి గురి చేస్తుంది.

ప్ర‌తి ప‌క్షాలో, హ‌క్కు సంఘాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు కానేకాదు పోలీసు రికార్డులే చెబుతున్నాయంటే ప‌రిస్థితి ఎలా చేయిదాటిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

అదృశ్య‌మైన వారిలో ఎక్కువ‌శాతం వ‌యోజ‌నులే ఉండ‌డంతో మ‌రింత క‌ల‌వ‌రానికి గురి చేస్తుంది. కాగా 235 మంది ఆచూకీ.అయితే, అదృశ్యమైనవారిలో 235 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు.

మిగతా 572 మంది ఏమయ్యారో తెలియరాలేదని పోలీసుల రికార్డులు చూపుతున్నాయి.

బాల‌ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌లు…

వదృశ్య‌మైన వారిలో 191 మంది మైనర్లు ఉండటంతో బాలల భద్రతపై ఆందోళన గురి చేస్తుంది. వీరిలో ఎక్కువ మంది బాలికలే ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.

ఈ మ‌ధ్య కాలంలో 169 మంది టీనేజర్లు త‌ప్పిపోగా వారిలో 138 మంది బాలిక‌లు, 31 మంది బాలురు ఉన్న‌ట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఈ కేసుల్లో దాదాపు 71శాతం ఇప్ప‌టికి ప‌రిష్కారం కాలేద‌ని పోలీసుల డేటాతో తెలుస్తుంది.అలాగే, 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు 13 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ఎనిమిది మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.

వీరిలో ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. మిగితా వారిజాడ కాన‌రాలేదు. గతేడాది ఢిల్లీలో 24,500కు పైగా మిస్సింగ్ కేసులు న‌మోదు కాగా వీరిలో 60 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.

గత 10 ఏళ్లలో నగరంలో దాదాపు 2.3 లక్షల మంది అదృశ్యమయ్యారు, వీరిలో సుమారు 52,000 కేసులు ఇంకా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండ‌డంతో ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను మ‌రింత క‌ల‌వ‌రానికి గురిచేస్తుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు