Homeతెలంగాణముఖ్యమంత్రి పర్యటన: ముందస్తుగా తిరుమలగిరి అశోక్ అరెస్ట్

ముఖ్యమంత్రి పర్యటన: ముందస్తుగా తిరుమలగిరి అశోక్ అరెస్ట్

  • ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా
  • మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ బ్యూరోతెలంగాణ రాష్ట్రంలో బీసీల అణిచివేత దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు.

బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు.

ఈ సందర్భంగా తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో బీసీల అణిచివేత దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అన్నారు. అన్ని రంగాలలో ముఖ్యమంత్రి తమ వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తూ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్ధత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

రాహుల్ గాంధీ మాటని తుంగలో తొక్కి అగ్రవర్ణ పాలన కొనసాగిస్తూ బీసీలను అడుగడుగునా అణచివేస్తున్నారు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలం చెందారని ఆయన అన్నారు.

ఇలా అక్రమ అరెస్టులు చేసి ఎన్ని రోజులు పాలన కొనసాగిస్తారు చూస్తాం అని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలో మీకు మా బిసీలు బుద్ది చెప్తారు అన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు