Homeక్రైమ్Koti ATM Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం దగ్గర స్పాట్ పెట్టి..

Koti ATM Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం దగ్గర స్పాట్ పెట్టి..

Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉదయం కోఠి లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా..

ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.6లక్షలు డిపాజిట్ చేసేందుకు ఈ రోజు ఉదయం రషీద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి.. ఆ నగదు మొత్తం తీసుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిందితుల కోసం పోలీసుల వేట

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాలను స్థానికులని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుంగడుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు