Homeక్రీడలుDelhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ కు కొత్త కెప్టెన్.. మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ కు కొత్త కెప్టెన్.. మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!

IPL 2026: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. రీసెంట్ గా 2026 ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం కూడా పూర్తయింది. ఐపీఎల్‌కి సంబంధించి ఏ వార్త అయిన ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌(Axar Patel)ను ఈ సీజన్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్

గత సీజన్‌లో ఢిల్లీకి రిషభ్ పంత్ స్థానంలో అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఆ ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్(KL Rahul) నాయకత్వంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గతంలో పంజాబ్ కింగ్స్,లక్నో సూపర్ జెయింట్స్‌కి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

అక్షర్ పటేల్ గురించి..

అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. గత ఆరేళ్లుగా జట్టుకు ప్రధాన బలంగా కొనసాగుతున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ.. కీలక ప్లేయర్‌గా జట్టులోనే కొనసాగుతాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా అక్షర్ కేవలం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనపై దృష్టి పెడితే జట్టుకు మరింత ప్రయోజనం ఉంటుందని కోచింగ్ స్టాఫ్ భావిస్తున్నట్లు టాక్. త్వరలోనే కెప్టెన్ మార్పుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments