Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో కనిపించని పవన్‌ మార్క్‌ - త్యాగరాజులా మిగిలిపోతారా..! - ఏడాది పాలనపై రివ్యూ

ఏపీలో కనిపించని పవన్‌ మార్క్‌ – త్యాగరాజులా మిగిలిపోతారా..! – ఏడాది పాలనపై రివ్యూ

కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దుందుకుడు…. ఆ తర్వాత కనుమరుగు. పవన్‌కళ్యాణ్‌ స్ట్రాటజీ ఇదేనా..? ఏపీ రాజకీయాల్లో ఆయన మార్క్‌ ఎందుకు కనిపించడంలేదు. మొదట్లో కనిపించిన కసి.. ఇప్పుడెందుకు లేదు..? వరుస తప్పిదాలతో సెల్ఫ్‌ గోల్‌ ఎందుకు వేసుకుంటున్నారు. పవన్‌ తీరు టీడీపీకి ఫేవర్‌గా.. జగన్‌కు వరంగా ఎందుకు మారుతోంది..? ఏడాది పాలనలో జనసేన అధ్యక్షుడు సాధించింది ఏంటి…?

పవన్‌ కళ్యాణ్‌… 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఘనవిజయం సాధించి.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాయకుడు. కూటమి అధికారంలోకి రావడానికి జనసేనదే కీలక పాత్ర అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ప్రధాని మోడీతో కూడా పవన్‌ ప్రసంశలు అందుకున్నారు. మరి… అంత పేరు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడెందుకు త్యాగరాజులా మారిపోతున్నారు. వరుస తప్పిదాలతో పార్టీ మైలేజ్‌ని ఎందుకు తగ్గిస్తున్నారని… సొంత పార్టీ నేతలే ప్రశ్నించుకుంటున్నారు. ఇంతకీ… పవన్‌ చేసిన, చేస్తున్న తప్పులేంటి…?


Also Read : చిన్న కొడుకును హైదరాబాదులోనే చదివిస్తున్న పవన్ కళ్యాణ్!.. స్కూల్ విశేషాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?


2024 ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ను.. ఏపీ ప్రజలు బలంగా నమ్మారు. ఆయన చెప్పిన ప్రతి మాటపై విశ్వాసం ఉంచారు. జనసేనతోపాటు కూటమిలోని టీడీపీ, బీజేపీకి కూడా మూకుమ్మడిగా ఓట్లు వేసేశారు. వైసీపీకి ఘోర పరాజయం ముట్టజెప్పారు. టీడీపీతో పొత్తుపెట్టుకుంటే… జనసేనకు గ్రౌండ్‌ లెవల్‌లో బలం పెంచుకునే అవకాశం వస్తుందని పవన్‌ అభిమానులు భావించారు. కూటమి అధికారంలోకి రాగానే… పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో.. పొంగిపోయారు. ఆ తర్వాత… పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాలు వారిని మెప్పించాయి. తిరుమల తొక్కిసలాట ఘటనతో చలించినపోయిన పవన్‌ కళ్యాణ్‌.. ప్రజలు క్షమాపణలు చెప్పారు. టీటీడీ బోర్డుతో కూడా సారీ చెప్పించారు. ఆ తర్వాత.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని… ఏకంగా హోంమంత్రి అనితపైనే విమర్శలు చేశారు పవన్‌. సీఎం చంద్రబాబు కంటే ముందే పవన్‌ స్పందించడం చూసి.. భవిష్యత్‌లో రాజ్యం జనసేనదే అనుకుని మురిసిపోయారు. తప్పుచేస్తే పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తారన్న భయం కూడా టీడీపీ నేతల్లో కనిపించింది. కానీ.. ఆ తర్వాత నెమ్మదిగా సీన్‌ రివర్స్‌ అయ్యింది.


Also Read : కాకాణి తర్వాత స్కెచ్‌ పేర్నినానికేనా – త్వరలోనే తండ్రితోపాటు కుమారుడు కిట్టు అరెస్ట్‌..!


ప్రస్తుతం… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పవన్‌ కళ్యాణ్‌ పెద్దగా స్పందించడంలేదు. ఏం జరిగినా.. పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో ఇంటర్‌ విద్యార్థిని మృతిపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ విషయంలో జనసేనాని నుంచి రాయాక్షన్ రాలేదు. అంతకుముందు… కడపలోని నాశినాయన ఆశ్రమం కూలగొట్టిన సమయంలోనూ లోకేష్‌ స్పందించారే తప్ప… పవన్‌ కళ్యాణ్‌ స్పందించలేదు. అటవీశాఖ బాధ్యతలు పవన్‌ కళ్యాణ్‌ చూస్తున్నా నోరుమెదపలేదు. ఇటీవల సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల బహిష్కరణ అంశంపై కూడా పవన్‌ మాట్లాడలేదు. ఇవన్నీ జనసేనకు మైనస్‌గా మారుతున్నాయి. పైగా… కూటమి కలిసే ఉంటుందని… చంద్రబాబే సీఎంగా ఉంటారని పదే పదే చెప్తున్నారు పవన్‌. అంటే.. ఆయనకు ముఖ్యమంత్రి కావాలని లేదని.. జనసైనికులు నిరుత్సాహపడుతున్నారు.

ఇక.. మంత్రిగా ఉన్న లోకేష్‌ మాత్రం బలం పెంచుకుంటున్నారు. తనకంటూ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని.. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఇవన్నీ చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. అంటే.. లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ తాగ్యం చేస్తున్నారా..? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి. వీటిపై కూడా పవన్‌ స్పందించకపోవడంతో… ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న మొదలైంది. ఏదాడిలోనే పవన్‌ గ్రాఫ్‌ పడిపోతే… నాలుగేళ్లలో ఇంకెలా ఉంటుందో అని జనసేన నేతలు, కార్యకర్తలకు భయం పట్టుకుంది. ఇప్పటికైనా.. పవన్‌ కళ్యాణ్‌ కళ్లు తెరిచి.. త్యాగరాజులా కాకుండా… జనసేన రాజకీయ భవిష్యత్‌ కోసం ఆలోచిస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజావార్తలు