Wednesday, March 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్టీటీడీ హుండి లెక్కింపులో అక్రమాలు.. కీలక ఉద్యోగి సస్పెండ్

టీటీడీ హుండి లెక్కింపులో అక్రమాలు.. కీలక ఉద్యోగి సస్పెండ్

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు బరి తెగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు. టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు బయటపడ్డాయి. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేశాడు సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్. గత సంవత్సరం ఒక నెలలో రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా అయినట్లు గుర్తించారు.

శ్రీవారి హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేది తిరుమల పరకామణిలో జమ చేయాలి. అయితే విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించింది టీటీడీ విజిలెన్స్ వింగ్. లోతుగా విచారణ జరిపి సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు విజిలెన్స్ వింగ్ అధికారులు. అక్రమాలకు సంబంధించిన నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు సమర్పించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో శ్యామలరావు

RELATED ARTICLES

Most Popular

Recent Comments