Sunday, March 8, 2026
Homeతెలంగాణ2 గంటలు నిలిచిపోయిన మెట్రో.. హైదరాబాదీలు ఆగమాగం

2 గంటలు నిలిచిపోయిన మెట్రో.. హైదరాబాదీలు ఆగమాగం

బుధవారం ఉదయం హైదరాబాదీలు నరకం చూశారు. ఉదయాన్నే విధులకు వెళ్లేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల పాటు ఎక్కడికి వెళ్లలేక పాట్లు పడ్డారు. హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. నాగోల్‌ నుంచి రాయదుర్గం వెళ్లే బ్లూ లైన్‌ ‌లో సిగ్నలింగ్ సమస్యలు తలెత్తడంతో బుధవారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగింది. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది. దాదాపు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు.

సిగ్నలింగ్ ఇష్యూ రావడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో రైళ్ల రాకపోకలలో అంతరాయం ఏర్పడటంతో వెంటనే ఎల్‌ అండ్ టీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఇంకా బ్లూ లైన్ రూట్‌లో మెట్రో రైళ్లు స్లోగా నడుస్తున్న పరిస్థితి నెలకొని ఉంది.

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఐదు లక్షల మందికిపైగా ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్, అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో ఉదయం సమయంలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇలాంటి సమయంలో సాంకేతిక కారణాలతో మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments