Wednesday, March 4, 2026
Homeతెలంగాణ2 లక్షల రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

2 లక్షల రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాల సభల్లోనూ రగడే జరుగుతోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గ్రామానికి వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. తమకు పథకాలు ఇవ్వకపోతే సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ కాని రైతులు గ్రామ సభల్లో ఆగమాగం చేస్తున్నారు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతు భరోసాతో పాటు రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. న్యాయంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. అధికారులు ప్రజా పాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు.

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్‌ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కిరికీ నిరసన తెలిపే హక్కు ఉందని.. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే.. ఆ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments