క్రైమ్

భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం

చైనాను అల్లకల్లోలం చేస్తున్న హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్‌ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో తొలి కేసులు వెలుగుచూశాయి. ఒకే రోజు దేశంలో 6 కేసులు నమోదయ్యాయి. చైనా వైరస్ కేసులు వచ్చినట్లు ఐసీఎంఆర్ కూడా ప్రకటించింది. బెంగళూరులో రెంజు, చెన్నైలో రెండు, అహ్మదాబాద్ లో ఒకటి, బెంగాల్ లో మరో కేసు నమోదైంది. ఆరు కేసుల్లోనూ చిన్న పిల్లల్లోనే చైనా వైరస్ నిర్దారణ అయింది. చైనాలోనూ ఎక్కువగా పిల్లలే హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్‌ భారీన పడుతున్నారు.

బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తించారు. మూడు నెలల ఆడ శిశువును, తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్‌ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. మూడు నెలల చిన్నారి ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కాగా.. మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్‌పేట్, గిండిలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిన వీరినుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్‌ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది.దేశంలో ఆరు చైనా కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొత్త వైరస్ పై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button