
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సరిగ్గా ఇదే రోజున శ్రీలంక పై 173 బంతుల లోనే ఏకంగా 264 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ నమోదు చేసిన ఈ రికార్డు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కరెక్ట్ గా 2014వ సంవత్సరంలో ఇది రోజు నవంబర్ 13వ తేదీన శ్రీలంకతో జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించారు. 173 బంతుల్లో 264 పరుగులు చేసి తన క్రికెట్ కెరీర్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదు చేశారు. అప్పటిలో ఈ మ్యాచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బిత్తర పోయారు. రోహిత్ శర్మ ఏంటి?.. ఇంతసేపు గ్రీసులో ఉండడమేంటి?.. భారీ పరుగులు చేయడమేంటి?.. అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఆ మ్యాచ్ తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా టీమిండియాలో స్టార్ బ్యాట్స్మెన్ గాను.. ఓపెనర్ గాను ఎన్నో మ్యాచ్లను వంటి చేతితో గెలిపించారు. ఆ మ్యాచ్ లో మొత్తంగా 33 ఫోర్లు, 9 సిక్స్ లతో ఆకాశమే హద్దుగా చెల రేగిపోయారు. 2013లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ.. 2014 మరియు 2017లో శ్రీలంకపై రెండుసార్లు డబుల్ సెంచరీలు చేశారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో టీమిండియా 153 పరుగులు తేడాతో ఆ రోజు ఘన విజయం సాధించింది. ఇక ఆ తరువాత నుంచి రోహిత్ శర్మ అటు ఐపిఎల్ లో కెప్టెన్ గాను తరువాత మెల్లిగా టీమిండియా కు కెప్టెన్ గాను వ్యవహరిస్తూ నేటి వరకు జట్టుకు ఎన్నో ట్రోఫీలను అందించారు.
Read also : ఢిల్లీనే కాదు… మరో 4 నగరాల పేలుళ్లకు కుట్ర.. దర్యాప్తులో బయటకు వచ్చిన అసలు విషయం!
Read also : చంద్రబాబు గారు మీ వల్లేనయ్యా ఇది సాధ్యం : సీఎం జగన్





