Homeక్రైమ్వంకాయ కూర తిన్న తర్వాత ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి.. వెలికితీసిన మృతదేహాలు

వంకాయ కూర తిన్న తర్వాత ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి.. వెలికితీసిన మృతదేహాలు

క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వంకాయ కూరతో రోటీలు తిన్న అనంతరం ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే చిన్నారుల మృతదేహాలను ఖననం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ఛతర్‌పూర్ జిల్లా పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్‌ముకుంద్ కుష్వాహ కుమార్తెలు పూనమ్ (7), మనీషా (3), చాహత్ (9 నెలలు) మృతి చెందారు. శుక్రవారం రాత్రి భోజనంలో వంకాయ కూరతో రోటీలు తిన్న తర్వాత ముగ్గురు చిన్నారులు అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో వారు మృతి చెందినట్లు పేర్కొన్నారు.

అయితే ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు ముగ్గురు చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. చిన్నారులను ఖననం చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పించి ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. చిన్నారులు తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆహారానికి, మరణాలకు మధ్య సంబంధం ఉందని నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు.

ముగ్గురు చిన్నారుల మృతిపై కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఘటన వెనుక ఉన్న పరిస్థితులు ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉన్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
also read :అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు