గోదావరిలో కుటుంబం గల్లంతైన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిలో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.
ఇటీవల నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలు ఇప్పటికే లభించాయి. తాజాగా మీనా మృతదేహం కూడా బయటపడటంతో కుటుంబ విషాదం మరింత విషాదకరంగా మారింది.
అయితే నూకరాజు మనవడు కార్తికేయ మాత్రం గోదావరిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబం గోదావరిలోకి దూకడానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
also read: ఢిల్లీలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై బంధువుల దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు
