Homeక్రైమ్ఢిల్లీలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై బంధువుల దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఢిల్లీలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై బంధువుల దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో కుటుంబ కలహం విషాదానికి దారితీసింది. విహార్ ప్రాంతంలోని లక్ష్మి పార్క్‌లో నివసించే 31 ఏళ్ల వినయ్ గుప్తా దాడిలో మృతి చెందారు. ఆయన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

వినయ్‌కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగున్నరేళ్ల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల కుటుంబ విషయానికి సంబంధించి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వినయ్ భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు వినయ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ మాటామాటా పెరగడంతో వినయ్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వినయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, దాడిలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్కెస్ట్రాపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు