కూకట్ పల్లి మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లుగా ఎంపికైన నేతలను ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ యువ నాయకుడు, V TEAM ప్రెసిడెంట్,శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం కంటెస్టడ్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి. డైరెక్టరుగా నియమితులైన నర్సింహ యాదవ్, మహ్మద్ జమీర్ భాయ్, ఎం సుధాకర్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకయ్య ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, V TEAM ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్, ట్రెజరర్ ఆదినారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బొంత రవి, సీనియర్ నాయకులు అహ్మద్ కనకయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
175 Less than a minute