Homeతెలంగాణఅసెంబ్లీ బడ్జెట్: అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..!

అసెంబ్లీ బడ్జెట్: అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..!

  • అసెంబ్లీ బడ్జెట్: అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..

  • ఇది “ప్రజా బడ్జెట్” కాదు “చీటింగ్ బడ్జెట్”

  • కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు పొందుతున్నాడు..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నేటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్‌లోని కేటాయింపులు, పథకాల అమలుపై ప్రభుత్వం “ప్రజా బడ్జెట్” అని చెబుతుండగా, విపక్షాలు మాత్రం అది కేవలం అంకెల గారడీ అని కొట్టిపారేస్తున్నాయి…

ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయని, ఇది ప్రజలను మోసం చేసేలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అందుకే దీనిని ఆయన “చీటింగ్ బడ్జెట్” అని అభివర్ణించారు.

సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్: ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించకుండా, ఇంట్లో ఉంటూనే జీతభత్యాలు పొందుతున్నారని విమర్శించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు