Homeఆంధ్ర ప్రదేశ్'తూర్పు'లో వైసిపి ఫుల్ సైలెన్స్!

‘తూర్పు’లో వైసిపి ఫుల్ సైలెన్స్!

•పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్న నేతలు
•నియోజకవర్గాలకు దూరంగా కాపు నాయకులు
•ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కష్టం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లా తూర్పుగోదావరి. అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. అక్కడ గెలిచే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఇచ్చాయి. అంతటి సెంటిమెంటు సొంతం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతావారు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

* పవన్ ప్రభావం అధికం..
మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం అధికంగా కనిపించింది తూర్పుగోదావరి జిల్లాలో. ఈ జిల్లా కాపు సామాజిక వర్గం అధికం. ఫలితాలను తారుమారు చేసే స్థితిలో కాపులు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాపులు అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన పిలుపుతో కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అందుకే ఏ నియోజకవర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. గొప్ప విజయాన్ని అందుకుంది టిడిపి కూటమి. అయితే కాపుల అంచనాలకు అనుగుణంగా కూటమిపాలన సాగడం లేదు. తమ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం లేదన్న ఆవేదన వారిలో ఉంది. అయితే దానిని క్యాష్ చేసుకోలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చాలామంది నేతలు కనీసం నియోజకవర్గాల ముఖం కూడా చూడడం లేదు.

* లెక్కలేనంత మంది నాయకులు..
తూర్పుగోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నాయకులు ఉన్నారు. తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి చాలామంది నేతలు ఉన్నారు. కానీ అప్పుడప్పుడు మార్గాన్ని భరత్ వంటి వారు మాత్రమే సందడి చేస్తున్నారు. ఒక్క కాపు నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. పార్టీ జండా పట్టేందుకు కూడా ఏ నేత ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పవన్ ఉండగా మరోసారి ఛాన్స్ ఉండదన్న అభిప్రాయానికి ఎక్కువమంది నేతలు వచ్చారు. అందుకే నియోజకవర్గాలకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఇలానే కొనసాగితే తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు