Homeక్రైమ్దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. శనివారం రైల్వే ట్రాక్‌పై సుమారు 50 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది.

విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే రైల్వే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి వివరాలు, ఆమె అక్కడికి ఎలా చేరుకున్నారు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

also read: తిరుపతి జిల్లాలో ఏనుగు దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు