-
భార్య, కుమార్తె పోటి
-
గెలిచే ఛాన్స్ ఉంటుందన్న సర్వేలు
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని ప్రముఖ కుటుంబాలు బరిలో ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో అటువంటి సీన్ కనిపిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఫ్యామిలీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల బరిలో దిగింది. వీరప్పన్ భార్యతో పాటు కుమార్తె ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే వారు వేరువేరు పార్టీల నుంచి బరిలో దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
గంధపు చెక్కల స్మగ్లర్ గా..
గంధపు చెక్కల స్మగ్లర్ గా దేశవ్యాప్తంగా హల్చల్ చేశారు వీరప్పన్. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉన్న అటవీ ప్రాంతంలో వీరప్పన్ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించారు. అయితే పోలీస్ ఎన్కౌంటర్లో ఆయన హతం అయ్యారు. కానీ ఆయన చనిపోయిన ప్రతిసారి ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. వీరప్పన్ భార్యతో పాటు కుమార్తె సైతం మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా తమిళనాడు ఎన్నికల్లో వీరప్పన్ మొదటి భార్య ముత్తు లక్ష్మి, కుమార్తె విద్యారాణిలు పోటీ చేస్తున్నారు. ముత్తు లక్ష్మి డీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. క్రిష్ణగిరి నియోజకవర్గం నుంచి ఆమె బరిలో ఉన్నారు. ఆమె ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నట్లు పొలిటికల్ పండితులు చెబుతున్నారు. వీరప్పన్ భార్య ధాటికి మిగతా పార్టీల అభ్యర్థులు ఎదురీదుతున్నారు. అక్కడ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిది అనేది చెప్పలేకపోతున్నారు.
-
ఎన్ టి కే తరఫున కుమార్తె..
వీరప్పన్ వారసురాలిగా రంగంలోకి దిగారు ఆయన పెద్ద కుమార్తె విద్యారాణి. ఎన్ టి కే పార్టీ తరఫున ఆమె పోటీలో ఉన్నారు. మెట్టూరు నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ గత మంచి రాజకీయ అనుభవం ఉంది. వీరప్పన్ సానుభూతిపరుల ఆశీర్వాదం కూడా ఉంది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు వారిద్దరికీ టిక్కెట్లు ఇచ్చాయి.
-
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ..
అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు వీరప్పన్ ఫోటో తోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వీరప్పన్ కు ఆ కులంలో మంచి సానుభూతి ఉంది. దీనిని వీరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు వీరప్పన్ తమిళనాడు కోసం ప్రాణాలు అర్పించారని.. అటవీ సంపదను పరిరక్షించారని ఒక నమ్మకంగా చెబుతున్నారు. వీరప్పన్ కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మహిళలకు అండగా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఎక్కువగా తరలివస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే వీరప్పన్ కుమార్తె విద్యారాణి మంచి ప్రభావం చూపారు. క్రిష్ణగిరి నియోజకవర్గంలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. కేవలం 2000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో వీరప్పన్ మొదటి భార్య ముత్తు లక్ష్మీ పోటీ చేస్తున్నారు. అయితే సర్వేల్లో ఈ ఇద్దరు ముందంజలో ఉండడం విశేషం. ఓటర్లు మద్దతు తెలిపితే మాత్రం వీరప్పన్ ఫ్యామిలీ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.