క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన పెళ్లి రేపు ఘనంగా జరగబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రేపు వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో అతి కొద్ది మంది బంధువుల క్షమక్షంలో జరుగుతుంది అని ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలిసు . అయితే తాజాగా వీరు పెళ్లి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ 26వ తేదీన అనగా రేపు ఒకేరోజు రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు. రేపు ఉదయం తెలుగు పద్ధతిలో వివాహము.. అదే రోజు సాయంత్రం కర్నాటక కొడువ సాంప్రదాయంలో పెళ్లిళ్లు చేసుకోనున్నారు. టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలలో ఇలా బహుశా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఇకపోతే మార్చి మూడో తేదీన హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో.. సినిమా, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నో ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన ఈ వార్తలు పై సమాధానమైతే ఇవ్వలేదు. కానీ నేడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఫ్యాన్స్ లో కూడా ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒకటవుతున్న సందర్భాన్ని యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు అందరూ కూడా ఆనందంగా గడుపుతున్నారు.
ప్రేమ విఫలమా…ఆ రోజు ఏం జరిగింది…?
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : కేటీఆర్

