Homeతెలంగాణనేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...!

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: డిలిమిటేష‌న్‌పై హైబ్రిడ్ మోడ‌ల్‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి త‌న వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం ఢిల్లికి బ‌య‌లు దేరి వెళ్ల‌నున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదనకు జాతీయ స్థాయిలో బలం కూడగట్టేందుకు ఆయన చర్యలు చేపట్టారు. అలాగే ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం రేవంత్ సమన్వయం చేస్తున్న విషయం విదితమే. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులందరికి ఆయన లేఖలు రాశారు.

హైబ్రిడ్ మోడల్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. మరో వైపు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు