Homeక్రైమ్అన్న చేతిలో త‌మ్ముడి దారుణ హ‌త్యా... చాద‌ర్‌ఘాట్‌లో క‌ల‌క‌లం...!

అన్న చేతిలో త‌మ్ముడి దారుణ హ‌త్యా… చాద‌ర్‌ఘాట్‌లో క‌ల‌క‌లం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: బంధాల‌కు,బంధవ్యాల‌కు నేటి స‌మాజంలో రానురాను విలువ‌లేకుండా పోతుంది. మాన‌వ‌త్వం మ‌రిచి క ర్క‌శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ సొంత త‌మ్ముడినే హ‌త్య చేసిన ఘ‌ట‌న చాద‌ర్‌ఘాట్‌లో క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల ప్ర‌కారం అజంపురలోని ముస్లిం మెటర్నిటీ వెనుక భాగంలో నివాసం ఉండే హాసిం హుస్సేన్, షాఫ్దాన్ హుస్సేన్ అన్నదమ్ములు. వారి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 6.40 గంటల ప్రాంతంలో తమ్ముడు షాఫ్దాన్‌ను అన్న హాసిం హత్య చేశాడు.

హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు హాసిం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు