HomeజాతీయంVijay: ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణం, ఎవరి మద్దతు తీసుకుంటున్నారంటే?

Vijay: ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణం, ఎవరి మద్దతు తీసుకుంటున్నారంటే?

Vijay Set to Be CM: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత విజయ్  శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో, ఈ నెల 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

108 సీట్లు సాధించిన టీవీకే

ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన 118 సీట్ల మెజారిటీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. అలాగే వామపక్ష పార్టీలు కూడా టీవీకే నాయకులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోగా, వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీల మద్దతు లభిస్తే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు సులభమవుతుంది. అదనంగా ఐయూఎంఎల్, డీఎండీకే, పీఎంకే వంటి పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గవర్నర్ కు విజయ్ లేఖ

ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారికంగా గవర్నర్‌ను ఆహ్వానించాల్సిందిగా విజయ్ ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో, తమకు మెజారిటీ నిరూపించుకునేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తంగా, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. ఇతర పార్టీల మద్దతు లభిస్తే, త్వరలోనే తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశముంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు