HomeసినిమాSanchitha Ugale: షాకింగ్.. నటి సంచితా ఉగాలే ఆత్మహత్య.. బాలీవుడ్‌ లో తీవ్ర విషాదం!

Sanchitha Ugale: షాకింగ్.. నటి సంచితా ఉగాలే ఆత్మహత్య.. బాలీవుడ్‌ లో తీవ్ర విషాదం!

Sanchitha Ugale Suicide Case: బాలీవుడ్ టెలివిజన్ రంగంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ నటి సంచితా ఉగాలే ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణ వార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త బయటకు రావడంతో బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

‘కుంకుమ భాగ్య’ సీరియల్స్ తో మంచి గుర్తింపు 

సంచితా ఉగాలే టెలివిజన్ సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ‘కుంకుమ భాగ్య’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తన సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె, తర్వాత పలు టీవీ ప్రాజెక్టులతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు.

పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు

ఇటీవల విడుదలైన విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ చిత్రంలోనూ, మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైలెన్స్-2’ సినిమాలోనూ సంచితా కీలక పాత్రలు పోషించారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆత్మహత్యకు కారణాలేంటి?

ఆమెతో కలిసి పనిచేసిన పలువురు సహనటులు, స్నేహితులు సంచితా ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండేదని చెబుతున్నారు. ఇటీవల కూడా ఆమె సోషల్ మీడియాలో చురుకుగా కనిపించినట్లు అభిమానులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఆమె ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం ఈ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించిందా? వ్యక్తిగత లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు సంచితా ఉగాలే మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు