Homeఅంతర్జాతీయంTrump Praises PM Modi: మోదీ టఫ్ నెగోషియేటర్.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!

Trump Praises PM Modi: మోదీ టఫ్ నెగోషియేటర్.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!

ఫ్రాన్స్‌ లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలు, వాణిజ్యం, భద్రత తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

దేశ ప్రయోజనాల విషయంలో కఠిన వైఖరి!

ఈ సమావేశం అనంతరం మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని అత్యంత సమర్థవంతమైన, టఫ్ నెగోషియేటర్ గా అభివర్ణించారు. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా, దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎంతో దృఢంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.భారత ప్రజల పట్ల మోదీకి అపారమైన నిబద్ధత ఉందని ట్రంప్ అన్నారు. అదే సమయంలో అమెరికాతో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. భారత్‌తో అమెరికా స్నేహబంధం మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అమెరికాలో భారత పెట్టుబడులను స్వాగతిస్తున్నాం!

వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని ట్రంప్ తెలిపారు. అమెరికాలో భారత పెట్టుబడులు పెరగడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురైనా అమెరికా మద్దతు కొనసాగుతుందన్నారు. భారత్‌ తో తమ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, మోదీ నాయకత్వాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పారు.

ఇక ప్రధాని మోదీ కూడా ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రయత్నాలను ప్రశంసించారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం జరుగుతున్న చర్యలను అభినందించారు. ఆ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం ప్రపంచానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి స్వేచ్ఛాయుత రవాణా కొనసాగడం చాలా ముఖ్యమని మోదీ చెప్పుకొచ్చారు. ఈ అంశంలో భారత్‌, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జీ7 సదస్సు వేదికగా జరిగిన ఈ భేటీ భారత్-అమెరికా సంబంధాలకు కొత్త ఊపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు