Homeఅంతర్జాతీయంఇరాన్ కు ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు.. కథ ముగించేస్తాం అంటూ వ్యాఖ్య..!

ఇరాన్ కు ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు.. కథ ముగించేస్తాం అంటూ వ్యాఖ్య..!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- అమెరికా – ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను ఉద్దేశించి మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మరోసారి ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల వ్యవహారం వివాదాస్పదంగా మారనుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్తో తాము శాంతి ఒప్పందమైన చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్ ను పూర్తిగా ముగిస్తామని డెహ్రాన్ కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అమెరికా అనుకుంటే కొన్ని గంటల్లో ఇరాన్ దేశ మౌలిక సదుపాయాలను పూర్తిగా కొప్ప కూల్చే సామర్థ్యం తమకు ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇరుదేశాల మధ్య కొద్ది రోజుల కిందట శాంతిని నెలకొల్పేందుకు వీలుగా 60 రోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతవారం జరిగిన పరోక్ష అమెరికా – ఇరాన్ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ట్రంప్ తాజాగా ఈ తరహా వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. తాము మిలిటరీ చర్య కంటే దౌత్యపరమైన ఒప్పందానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. నేను ఒప్పందానికి మొగ్గు చూపుతానని, ఎందుకంటే అక్కడే 9.1 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడటం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కానీ వారికి తమ శక్తి ఏంటో తెలుసని, తాము అనుకుంటే కేవలం ఒక గంటలోనే వారి భారీ బ్రిడ్జిలు కూల్చేయగలమని హెచ్చరించారు. వారు భారీ ఖర్చుతో నిర్మించుకున్న ఆధునిక ఎనర్జీ ప్లాంట్లు, విద్యుత్ కేంద్రాలను ఒక్క పూటలోపే పూర్తిగా తుడిచి పెట్టేగలమని హెచ్చరించారు. ప్రతి ప్లాంట్ మాయమైపోతుందని, ఆ విషయం వారికి కూడా బాగా తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి.

శాంతి చర్చలపై ప్రభావం చూపించేనా..

తాజాగా ఇరాన్ ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య 60 రోజులు పాటు యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ ఉంది. అయితే ఈ ఒప్పందాన్ని కూడా పలుమార్లు ఇరుదేశాలు ఉల్లంఘించాయి. రెండు మూడుసార్లు కాల్పులు జరగడంతో పాటు డ్రోన్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడంతో ఇరాన్ కూడా ప్రతిగా స్పందిస్తే పరిస్థితి ఉదృతంగా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై ఇరాన్ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే ట్రంప్ మరో కీలక విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో ఇరాన్ కు భారీగా నిధులు అందేవని, ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశారు. అమెరికా కూడా వారికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఇరాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇరాన్ ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఇరాన్ స్పందించే తీరును బట్టి భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు