Homeక్రైమ్నిజామాబాద్‌లో దారుణం....! ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌...!

నిజామాబాద్‌లో దారుణం….! ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌…!

నిజామాబాద్,క్రైమ్ మిర్ర‌ర్‌: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహ‌మై ఫ్యామిలీ ఉన్న‌ప్ప‌టికీ ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి క‌ట్టుకున్న భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. ప్రియుడితో క‌లిసి భ‌వ‌నం తోసి వేసిన ప్రాణం పోలేద‌ని న‌రాల్లో హార్పిక్ ఇంజ‌క్ష‌న్ ఇచ్చి చంపేసి ఏమి తెలియ‌న‌ట్టు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో పోలీసులు త‌న‌శైలిలో విచారించ‌డంతో అస‌లు నిజం బ‌య‌ట ప‌డింది.

Also Read:Influencer Murder: సోషల్ మీడియా పంచాయితీ.. భార్యను దారుణంగా చంపిన భర్త!

నిజమాబాద్‌ శివారులో నివాసం ఉంటున్న సంధ్య, ప్రశాంత్‌ చాలా కాలం క్రితం వివాహమైంది. అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య తగాదాలు మొదలయ్యాయి. దీనికి సంధ్య ప్రవర్తన కారణంగా తెలుస్తోంది. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీయడం మొదలు పెట్టారు. ఈ విషయంలో దంపతులు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండే వారు. ఈ గొడ‌వ‌లతో విసిగిపోయిన సంధ్య త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త‌ను వ‌దిలించుకునందుకు స్కెచ్ వేయ‌గా దీనికి ప్రియుడు కూడా ఒకే చెప్ప‌డంతో ఎవ‌రికి అనుమానం రాకుండా భ‌ర్త‌కు ఉన్్న మ‌ద్యం అల‌వాటును వాడుకుంది. దీంతో ప్లాన్ అమ‌లు చేసింది.

Also Read:Affair: భార్యకు ద్రోహం.. పెళ్లైన మూడు నెలలకే ప్రియురాలితో కలిసి భర్త కిరాతకం!

ఒక రోజు తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించింది. మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి బిల్డింగ్‌పైకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి తోసేసి హత్య చేయాలని అనుకుంది. ఇద్దరూ కలిసి ప్రశాంత్‌ను బిల్డింగ్‌ పై నుంచి తోసేశారు. అయితే అక్కడి నుంచి పడినప్పటికి గాయాలతో ఉన్న ప్రశాంత్ ప్రాణాలు ఉన్నాయి. ఇలా అయితే లాభం లేదని గ్రహించి, కొనఊపిరితో ఉన్న భర్త ప్రాణాలు తీసేందుకు మరో కిరాతకానికి ఒడిగట్టింది. బిల్డింగ్‌ పైనుంచి పడిపోయి గాయాలతో బాధపడుతున్న భర్తకు బాత్‌రూమ్‌లో ఉన్న హార్పిక్ ఎక్కించింది. ప్రియుడితో కలిసి సిరింజ్‌ సహాయంతో నరాల్లోకి హార్పిక్‌ ఇంజెక్ట్ చేసింది. హార్పిక్‌ శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించింది. దీంతో ఒళ్లంతా విషపూరితమై అవయవాలు పని చేయడం మనేశాయి. దీంతో అతి దారుణంగా ప్రశాంత్‌ కన్నుమూశాడు.

Also Read:Taj Mahal Row: తాజ్ మహల్ వివాదంలో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు!

మద్యం మత్తులో బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోయాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే దీనిపై ప్రశాంతం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. చాలా కాలంగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తెలిసిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాడీని పోస్టుమార్టానికి పంపిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. దీంతో సంధ్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. పరాయి వ్యక్తి మోజులో పడి భర్త ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. దీనిపై సమాజంలో ఒక విధమైన అలజడి రేగుతోంది. కుటుంబ బంధాలపై అవగాహన లేకపోవడం, క్షణికావేశాలతోనే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. బంధాల కంటే సౌఖ్యాలకు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు