Homeఆంధ్ర ప్రదేశ్తమ్మినేని చుట్టూ ఉచ్చు!

తమ్మినేని చుట్టూ ఉచ్చు!

•భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ కుటుంబం
•తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్
•కేసు నమోదు చేసిన పోలీసులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- 
ఏపీ మాజీ స్పీకర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఓ భూ కబ్జా కేసులో నిందితులుగా మారారు. ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. అసలు యజమాని బతికి ఉండగా.. ఆయన చనిపోయారని నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కొల్లగొట్టారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేలింది. దీంతో తమ్మినేని సీతారాం తో పాటు ఆయన భార్య, కుమారుడిపై కేసు నమోదయింది. ఈ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఫ్యామిలీతో సహా పరారీలో ఉన్నారు.

యజమాని చనిపోయారని చూపించి..
శ్రీకాకుళం బలగ పరిధిలోని సర్వే నెంబర్ 35 /13 లో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు కొందరు ప్రయత్నించారు. ఈ భూమికి సంబంధించి అంతవరకు గోవిందరాజులు అనే వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. ఒడిస్సా లోని జయపురం కు చెందిన అడబాల రజినీని గోవిందరాజులు కుమార్తె అందవరపు రజినీగా చూపించి.. తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకట్ నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలానికి ప్రహరీ నిర్మించే ప్రయత్నాన్ని అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం అయింది. నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వం సృష్టించడం, తప్పుడు రిజిస్ట్రేషన్ తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం వెనుక తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు..

వారంతా అరెస్ట్..
ఈ కేసులో నిందితులుగా ఉన్న అడబాల రజిని, తెలుగు సతీష్ కుమార్, సలిపిల్లి లక్ష్మణరావు, మూడట్ల ఉపేంద్ర కుమార్, జేగురిపాటి ఉపేంద్ర రావు, మామిడి గోపాలకృష్ణ, సంపాన సాంబశివరావు, కోనా పెద్దిరాజును అరెస్టు చేశారు పోలీసులు. ఇతర నిందితులుగా ఉన్న త్రినాథ్, తమ్మినేని చిరంజీవి నాగ్, తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణి లపై విచారణ కొనసాగుతోంది. వారిని సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్కు సహకరించిన సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు.

పరారీలో ఫ్యామిలీ..
తమ్మినేని సీతారాం కుటుంబాన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న తమ్మినేని సీతారాం ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు తమ్మినేని. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంకు నియోజకవర్గ బాధ్యతలు నుంచి తప్పించారు. శ్రీకాకుళం పార్లమెంటు బాధ్యతలు అప్పగించారు. అయిష్టంగానే వైసీపీలో ఆయన కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి తన కుమారుడు ను బరిలో దించాలని భావిస్తున్నారు. ఇంతలోనే ఈ కేసు వెంటాడింది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు