Homeఆంధ్ర ప్రదేశ్పల్నాడు జిల్లాలో విషాదం..విద్యుత్ షాక్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి...!

పల్నాడు జిల్లాలో విషాదం..విద్యుత్ షాక్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి…!

సత్తెనపల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌:vపల్నాడు జిల్లా చండ్రరాజుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి (కరెంట్ షాక్) గురై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన యోహాన్ రాజు (12) అనే బాలుడు శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్చిన అనంతరం వైద్యులు బాలుడిని బ్రతికించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కళ్లముందే ఆడుకుంటూ తిరిగిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చంద్రరాజుపాలెం గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు