క్రైమ్

రాజ్‌భవన్‌లో చోరీ! – కీలక హార్డ్‌డిస్కులు మాయం

క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ లో సంచలనం కలిగించే ఘటన చోటుచేసుకుంది. రాజ్‌భవన్ పరిధిలో ఉన్న సుధర్మ భవన్ లో నుండి నాలుగు హార్డ్‌డిస్కులు మాయమైనట్టు అధికార సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ హార్డ్‌డిస్కుల్లో కీలకమైన ఫైళ్లూ, రిపోర్టులూ ఉండటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 14వ తేదీన చోరీ జరిగినట్టు తెలిసింది. హెల్మెట్ ధరించిన అనుమానితుడు, రాత్రి సమయంలో కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించి హార్డ్‌డిస్కులు అపహరించినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, చోరీ చేసిన దుండగుడి కోసం విశేషంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్‌భవన్ లాంటి హైసెక్యూరిటీ ప్రాంతంలో ఇలా హార్డ్‌డిస్కులు చోరీకి గురవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Back to top button