Homeఆంధ్ర ప్రదేశ్స్టార్‌డమ్ కంటే ప్రజా సమస్యల పరిష్కారమే నాకు ఇష్టం: పవన్ కళ్యాణ్

స్టార్‌డమ్ కంటే ప్రజా సమస్యల పరిష్కారమే నాకు ఇష్టం: పవన్ కళ్యాణ్

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తనకు ఇప్పటికీ స్టార్ హీరోగా సినిమాలు చేసే స్థాయి ఉందని, కానీ ప్రస్తుతం ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే ఎక్కువ ఆనందం కనిపిస్తోందని పవన్ చెప్పడం చర్చనీయాంశమైంది.పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి అభిమాన వర్గం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని పవన్ స్పష్టం చేశారు.

ముఖ్యంగా తాను ఇప్పటికీ OG లాంటి పెద్ద సినిమాలు చేయగలనని చెబుతూనే.. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం తనకు మరింత సంతోషం ఇస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా రోడ్డు లేని ఒక గ్రామానికి రోడ్డు వేయడం.. మౌలిక సదుపాయాలు అందించడం.. ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరించడం వంటి పనుల్లో ప్రత్యేకమైన ఆనందం ఉందని తెలిపారు.సినీ రంగంలో అవార్డులు, ప్రశంసలు రావడం ఒక ఆనందమైతే.. ప్రజలకు నిజంగా ఉపయోగపడే పని చేయడం అంతకంటే గొప్ప అనుభూతి అని పవన్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన ఒకవైపు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమాలపై కూడా దృష్టి పెట్టడం ఆసక్తిగా మారింది.పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అభిమానులు ఆయన మాటలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. స్టార్ హీరోగా క్రేజ్ ఉన్నా.. ప్రజా సేవను ముందుకు పెట్టి మాట్లాడటం పవన్‌కే సాధ్యమని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణంపై మరోసారి స్పష్టత ఇచ్చాయి. స్టార్‌డమ్ తనకు కొత్త కాదని.. కానీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన సంతృప్తి అని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు అందరిలోనూ చర్చకు దారితీస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు