Homeతెలంగాణగవర్నర్‌గా ప్రమాణ స్వీకారం: చార్మినార్ లో "శ్రీ భాగ్యలక్ష్మి" అమ్మవారికి పూజలు

గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం: చార్మినార్ లో “శ్రీ భాగ్యలక్ష్మి” అమ్మవారికి పూజలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా తో కలిసి బుధవారం (మార్చి 11, 2026) హైదరాబాద్‌లోని పాతబస్తీ చార్మినార్ వద్ద గల శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకుముందు ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌లో (లోక్ భవన్) శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణకు బదిలీ అయ్యారు. మార్చి 10న హైదరాబాద్ చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ హోదాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు