
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి ఆగిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఒకరోజు ఉందనగా… స్మృతి మందాన తండ్రి కి హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి ఆగిపోయింది. మరోవైపు పలాస్ కూడా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో సబ్మిట్ అయ్యారు. ఆ తర్వాత స్మృతి మందాన వివాహపు ఫంక్షన్లకు దిగినటువంటి ఫొటోస్ అలాగే వీడియోలు అన్నీ కూడా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరూ విడిపోతారేమో… అంటూ కొంతమంది తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు.
Read also : నా కొడుకును ఘోరంగా అవమానిస్తున్నారు… ఇది ఒక విజయమే : పృధ్విరాజ్ తల్లి
అయితే తాజాగా ఈ వివాహం పై సస్పెండ్స్ కొనసాగుతున్న వేల పలాస్ము చ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే నా కొడుకుకి అలాగే స్మృతి మందనకు పెళ్లి జరుగుతుంది అని స్పష్టం చేశారు. పెళ్లి ఆగిపోయిన తర్వాత ఇరు కుటుంబాలు కూడా బాధపడ్డాయి అన్నారు.. మ్యారేజ్ అవ్వగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని పలాస్ తల్లి అమృత అన్నారు. ఇక అనుకోని పరిస్థితుల కారణంగా వివాహాన్ని వాయిదా వేసాము అని అన్నారు. దీంతో వీరిద్దరి వివాహం కచ్చితంగా జరిగి తీరుతుంది అని పలాస తల్లి అమృత ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
Read also : గ్రామాల్లో వేడి పుట్టిస్తున్న ‘క్యాంపు’ రాజకీయాలు..!





