క్రైమ్ మిర్రర్, మునుగోడు : మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల సౌకర్యార్థం 2001 – 2002 పూర్వ విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు.హెడ్మాస్టర్ బాల ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపిడిఓ విజయభాస్కర్,సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, ఎంఈవో మల్లేశం, ఏఎస్సై హబివుద్దీన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి , 2001 – 02 పూర్వ విద్యార్థులు,పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ..ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల సెక్యూరిటీ అన్నారు. చదువుకున్న పాఠశాలలో పాఠశాల అభివృద్ధికై మేమున్నామంటూ 2001 ,2002 సంవత్సరం పూర్వ విద్యార్థులు ముందుకు రావడం, పాఠశాల సౌకర్యార్థం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినదనీయం అన్నారు. ఈ పూర్వ విద్యార్థులు పాఠశాలకు అభివృద్ధికి పునాదిగా అయ్యారు అని, పలువురు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు..పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మన ఊరు మనబడి మనం చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే మేము ముందడుగు వేశామన్నారు. పాఠశాల అభివృద్ధికి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు..ఈ సందర్భంగా 2001 – 02 సంవత్సర పూర్వ విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు..ఉపాధ్యాయులు కునూరెడ్డి సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి,మహిళ ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు,భవిత పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ,గాలి సైదులు,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
2001 -02 పూర్వ విద్యార్ధుల సేవలు.. మునుగోడు ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు!!
By Crime Mirror
0
20