
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్: టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాద్‌కి చెందిన యువ క్రికెటర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ ఎంపికయ్యాడు. నాంపల్లి, మల్లెపల్లి ప్రాంతానికి చెందిన మాలిక్ ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రత్యేక ప్రతిభ చూపిస్తున్నాడు. ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న మాలిక్
మాలిక్ తన క్రికెట్ ప్రస్థానాన్ని పాఠశాల స్థాయిలోనే ప్రారంభించాడు. 2022లో హైదరాబాద్ అండర్-16 జట్టులో స్థానం దక్కించుకున్న అతను, విజయ్ మర్చంట్ ట్రోఫీలో 511 పరుగులు, అందులో ఒక ట్రిపుల్ సెంచరీ సాధించి తన ప్రతిభను చాటాడు. ప్రస్తుతం మాలిక్ హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు.
టీమిండియాలో ఆడటం నా కల: మాలిక్
“టీమిండియా తరఫున ఆడటం నా కల. ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలు, నా ప్రదర్శన ఈ దిశలో నేను వేస్తున్న మొదటి అడుగులు. అండర్-19లో ఆడితే, ఐపీఎల్ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ అవకాశం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది” అని మాలిక్ తెలిపారు.
అఫ్గానిస్తాన్ అండర్-19 సిరీస్
బీసీసీఐ ఇటీవల అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే సిరీస్ కోసం ఇరు జట్లను ప్రకటించింది. మాలిక్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సిరీస్ నవంబర్ 17 నుంచి బెంగళూరులో ప్రారంభమవుతుంది.
ALSO READ: SSMB 29: చీరకట్టులో గన్ పేలుస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రియాంకా చోప్రా





