HomeజాతీయంFlight Emergency Landing: పైలెట్ చాకచక్యం.. 150 మంది ప్రయాణీకులు సేఫ్!

Flight Emergency Landing: పైలెట్ చాకచక్యం.. 150 మంది ప్రయాణీకులు సేఫ్!

  • స్పైస్ జెట్ విమానం ఇంజన్‌‌లో సాంకేతిక లోపం
  • సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించిన పైలట్  
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పైలట్ అప్రమత్తతో దాదాపు 150 మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. న్యూఢిల్లీ నుంచి లేహ్ బయలుదేరిన విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ గుర్తించి, వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇంజన్‌‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి న్యూఢిల్లీ ఎయిర్‌ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులతో సంప్రదించారు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

150 మంది ప్రయాణీకులు సేఫ్

ఈ సమయంలో విమానంలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్‌లో వైఫల్యం కారణంగా ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు ఎయిర్ పోర్టు ఉన్నతాధిాకారులు వెల్లడించారు. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు