HomeతెలంగాణPeddi Movie: పెద్ది' మూవీ నుంచి స్పెషల్ సాంగ్ 'హెల్లల్లో' ప్రోమో రిలీజ్...!

Peddi Movie: పెద్ది’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ‘హెల్లల్లో’ ప్రోమో రిలీజ్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈరోజు చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హెల్లాల్లో’ ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో చూస్తుంటే ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలవనుందని అర్థమవుతోంది.

పవర్ ఫుల్ డ్రమ్ బీట్స్, క్యాచీ రిథమ్, జాతర వాతావరణాన్ని తలపించే ట్యూన్‌తో పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో రామ్ చరణ్ తన రగ్గ్డ్, స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ కూడా అలరించారు. శ్రుతి హాసన్ తన బోల్డ్ అటిట్యూడ్‌తో, జాన్వీ కపూర్ తన గ్రేస్‌ఫుల్ ఎనర్జీతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను మరింత గ్రాండ్‌గా మార్చింది. పూర్తి పాటను రేపు భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ఆర్. రత్నవేలు అందిస్తుండగా, ఎడిటింగ్ ను జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంల‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ త‌దిత‌రులు న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు