Homeక్రైమ్Silchar Crime: ఘోరం.. ప్రియుడితో వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం!

Silchar Crime: ఘోరం.. ప్రియుడితో వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం!

  • అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన

  • యువతిపై ఏడుగురు దుండగుల గ్యాంగ్ రేప్

  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

అస్సాం రాష్ట్రంలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై ఏడుగురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా, ఆమె వద్ద ఉన్న నగదు దోచుకెళ్లిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ నెల 19న దారుణ ఘటన

ఈనెల 19న గువాహటి‌లోని సిల్చార్ పట్టణానికి చెందిన బాధితురాలు తన ప్రియుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్డు వద్ద మహీంద్రా థార్‌లో కొంతమంది వ్యక్తులు వీరిని వెంబడించారు. కొంత దూరం వెంబడించిన తర్వాత దుండగులు కారును అడ్డుకుని, ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా రూ.10 వేలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్

ఈ ఘటనపై సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు వారిలో ఇద్దరిని గుర్తించిందని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సిల్చార్ పట్టణానికి చెందిన నీలోత్పాల్ దాస్ (25), సుబోల్ దాస్ (27)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు