Homeతెలంగాణమందు బాబుల‌కు షాక్‌...జూన్ 2 నుంచి మద్యం ధరల పెంపు...!

మందు బాబుల‌కు షాక్‌…జూన్ 2 నుంచి మద్యం ధరల పెంపు…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: రాష్ట్రంలో మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి.. ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కమిటీ సిఫార్సుల కంటే తక్కువగానే ప్రభుత్వం ధరలు పెంచనుంది.

తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో మందు, బీర్ల ధరలు పెరగనున్నాయని సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరల పెరుగుదలకు సంబంధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత.. అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మద్యం ధరలను పెంచాలని ఇప్పటికే తయారీ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

అదే సమయంలో గతంలో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మద్యం ధరలను పెంచాలని మద్యం తయారీ కంపెనీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధం ఎఫెక్ట్ సీసాల తయారీపైనా పడటంతో.. వాటి ధరలు పెరిగాయి. ఇక మద్యం ధరలో సీసాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సీసాల తయారీ ఖర్చు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటికి అనుగుణంగా ధరలను పెంచాలని కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.ఇక అన్ని మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపడుతోంది.

దీంతో సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు కూడా భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెంచిన మద్యం ధరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్థిక, అబ్కారీ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి.మరోవైపు.. మద్యం ధరల పెంపు , ఆదాయ వనరులకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే సర్కార్‌కు కీలక ప్రతిపాదనలు అందించింది.

ఈ నేపత్యంలోనే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం ధరలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఏకంగా 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచవచ్చని.. ఆ త్రిసభ్య కమిటీ సర్కార్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి అంత పెంచితే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ధరలను పెంచాలని అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు