ఎవరి జోక్యం లేదు.. రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!

0
130
Shashi Tharoor Has Counter For Rahul Gandhi On Narendra Surrender Jab At PM Modi Over India Pakistan
Shashi Tharoor Has Counter For Rahul Gandhi On Narendra Surrender Jab At PM Modi Over India Pakistan

Shashi Tharoor Counter To Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కామెంట్స్ ను సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ఆయన అనాలోచిత వ్యాఖ్యలను అంతర్జాతీయ వేదికల మీదే తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ సరెండర్ అయ్యారంటూ రాహుల్ చేసిన కామెంట్స్ ను సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ ఖండించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అంశంలో మూడో దేశం జోక్యం అనేదే లేదన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ ఎలా ప్రోత్సహిస్తుంది? దానికి బ్రేక్ చేసేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అంశాలను వివరించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష బృందాన్ని శశిథరూర్ లీడ్ చేస్తున్నారు.

ట్రంప్ పాకిస్తాన్ కు చెప్పి ఉండవచ్చు!   

తాజాగా వాషింగ్టన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న శశిథరూర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పాటు మోడీ సరెండర్ అయ్యారంటూ రాహుల్ చేసిన కామెంట్స్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈ రెండు రకాల ప్రకటనలు తప్పేనని శశిథరూర్ వెల్లడించారు. “పాకిస్తాన్ మీద దాడులు ఆపాలని భారత్ కు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. పాక్ ఆపితే తాము ఆపుతామని ముందే మేం ప్రకటించాం. ఒకవేళ ట్రంప్.. భారత్ దాడులు నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని, ఫస్ట్ మీరు ఆపాలని పాక్ కు చెప్పి ఉంటే, వారు(ట్రంప్) చేసిన గొప్పని అని ఉంటుంది” అని థరూర్ వెల్లడించారు.

ఉగ్రవాదాన్ని వీడకపోతే మేమేంటో చూపిస్తాం!

ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడకపోతే.. భారత్ తన ప్రతాపం ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉందని శశిథరూర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మూడో వ్యక్తి, మూడో దేశం అససరం లేదు. దేశం విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు వరుసగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ వ్యాఖ్యలును ఖండించడం లేదంటే బీజేపీని సమర్థించడం హస్తం పార్టీకి మింగుడుపడటం లేదు.

Read Also: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీపై కేసు, సీపీపై వేటు, హైకోర్టు సీరియస్!