యూపీలోని నోయిడా సమీపంలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై పలు కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో మంటలు చెలరేగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రయాణికులు డ్రైవర్, క్లీనర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
ప్రయాణ సమయంలో బస్సులో పొగతో పాటు కాలిన వాసన వచ్చినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని డ్రైవర్, క్లీనర్ల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్యను వెంటనే గుర్తించి బస్సును నిలిపివేసి ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా బస్సు క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ సిగరెట్ తాగినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. వారి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయని ఆరోపించారు. ఈ ఘటనలో 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల ఆరోపణలు, బస్సులో మంటలు చెలరేగిన పరిస్థితులపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: మద్యం రవాణా టెండర్లపై ఈడీ ఫోకస్.. ముగ్గురిని ప్రశ్నిస్తున్న అధికారులు
