Homeసినిమాసంబరాల ఏటిగట్టు ఆలస్యంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ..!

సంబరాల ఏటిగట్టు ఆలస్యంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ..!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విరూపాక్ష వంటి భారీ విజయానంతరం సాయి ధరమ్ తేజ్ నుంచి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటిగట్టు పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా ప్రకటించిన తర్వాత గ్లింప్స్ తప్ప పెద్దగా ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో, రిలీజ్ ఆలస్యం అవుతుందంటూ సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సినిమా ఆలస్యానికి గల కారణాన్ని వివరించారు.

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి చాలా మారిపోయిందని, ఓటీటీలు, వెబ్ సిరీస్‌ల కారణంగా కంటెంట్‌పై వారి అవగాహన మరింత పెరిగిందని అన్నారు. ప్రేక్షకులను మెప్పించడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టమైందని, అందుకే కథల ఎంపిక నుంచి ప్రతి అంశంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని సాయి తేజ్ తెలిపారు. సంబరాల ఏటిగట్టు కోసం తాము ఎంతో కష్టపడుతున్నామని, ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా రావాలంటే కొంత సమయం అవసరమని చెప్పారు. ఆడియన్స్ ఇప్పుడు ప్రతి జానర్ గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారు. అందుకే మా సినిమా విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నాం. సంబరాల ఏటిగట్టు కోసం నా సర్వస్వం పెట్టి శ్రమిస్తున్నాను అంటూ సాయి దుర్గా తేజ్ చెప్పిన మాటలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఇక ఇదే కార్యక్రమంలో హనుమాన్ 3D గురించి కూడా సాయి తేజ్ మాట్లాడారు. ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాలు తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించాయని, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయని చెప్పారు. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని ఈ సినిమా కలిగిస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి సంబరాల ఏటిగట్టు ఆలస్యానికి ఎలాంటి సమస్యలు కారణం కాదని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా మరింత మెరుగైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతోనే సమయం తీసుకుంటున్నామని సాయి ధరమ్ తేజ్ స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న అనేక ఊహాగానాలకు తెరపడినట్లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు