టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గత కొన్ని నెలలుగా ట్రోల్స్ కి గురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా మంచి మంచి సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి. ఇప్పటికే తెలుగులో అక్కినేని నాగచైతన్యతో తండేలు చిత్రంలో నటిస్తూ ఉంది. డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే హిందీలో కూడా రామయణ్ సినిమాలో నటిస్తుంది. ఇందులో సీత క్యారెక్టర్ గా సాయి పల్లవి, అలాగే రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు.
ఆన్లైన్ లో విషం ఆర్డర్.. ఐటీ మహిళా ఉద్యోగి సూసైడ్
అయితే ఇక తాజాగా తనపై వచ్చేటువంటి ట్రోల్స్ గురించి స్పందించి ఇలా మాట్లాడింది. ‘నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నిటినీ మౌనంగా ఎదుర్కొన్నాను. ఎందుకంటే నిజం ఏంటనేది ఎప్పుడు కూడా పై వాడికి తెలుస్తుంది. కాబట్టి భారం దేవుడి మీద వదిలేసి మౌనంగా ఉంటున్నానని అయినా కానీ రూమర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎంత గుర్తింపు పొందిన పెద్ద సంస్థ అయినా సరే నేను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటానని, ఇంక సహించలేనంటూ సాయి పల్లవి ట్విట్ చేసింది’. కాబట్టి ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ అనేది నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా రామాయణం కోసం సాయి పల్లవి ఎన్నో తన సొంత అలవాటులను మార్చుకున్నారని కోలీవుడ్లో ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ సినిమా పూర్తయ్య వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసిందట. హోటల్స్ లో కూడా తినకుండా విదేశాలకు వెళ్లినప్పుడు తన వెంట వంట మాస్టర్లను తీసుకువెళ్లిందట. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్విట్ చేసింది సాయి పల్లవి. ఈమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.