బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరందాటింది. కాబట్టి అది ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలపడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇక ఈ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది .
ట్రోల్లర్స్ కి ఇచ్చి పడేసిన సాయి పల్లవి!
ఇక అల్పపీడనం తీరం దాటే సందర్భంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాలు పడతాయని తాజాగా వాతావరణ శాఖ తెలపడంతో తమిళనాడులోని వాతావరణ శాఖ అధికారులు అందరు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జలమయ్యేటువంటి ప్రాంతాల్లోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఇక ఆయా జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించి అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. కాగా ఇప్పటికే భారీ వర్షాలు మరియు తుఫానులు కారణంగా వ్యవసాయదారులు పెద్ద ఎత్తున నష్టపోయారు.