Homeతెలంగాణడ్రైవర్ శంకర్ గౌడ్ మృతి... సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి… సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ (54) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ కన్నుమూశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

శంకర్ గౌడ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరూ కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి తగిన పరిష్కారాలు చూపాలని మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. శంకర్ గౌడ్ మృతితో నర్సంపేట మరియు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన అంత్యక్రియలు సొంత గ్రామంలో నిర్వహించబడ్డాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు